cm: సీఎం జగన్ కొత్త నిర్ణయాల ప్రభావం కచ్చితంగా ఉంటుంది: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
మద్యం కారణంగా చాలా కుటుంబాలు నాశనమైపోతున్నాయని జనసేన పార్టీ నేత, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. శ్రీకాకుళంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఎం జగన్ కొత్త నిర్ణయాల ప్రభావం కచ్చితంగా ఉంటుందని, మద్యపాన నిషేధంపై తీసుకున్న నిర్ణయం అభినందనీయమని అన్నారు. దశలవారీ మద్య నిషేధంతో ప్రజల్లో మార్పు వస్తుందని ఆయన ఆశించారు.