Pakistan: 2 వేల మందికి పైగా సైనికులను సరిహద్దుకు తరలించిన పాకిస్థాన్

  • నియంత్రణరేఖకు 30 కిలోమీటర్ల దూరంలో పాక్ బలగాలు
  • బాగ్, కోట్లీ సెక్టార్లలో మోహరించిన పాక్ సైన్యం
  • పాక్ సైన్యం కదలికలను గమనిస్తున్న ఇండియన్ ఆర్మీ
బోర్డర్ లో నెలకొన్న ఉద్రిక్తతలను మరింత పెంచేలా పాకిస్థాన్ వ్యవహరిస్తోంది. తాజాగా పీవోకేలోని నియంత్రణ రేఖ వద్దకు భారీ ఎత్తున సైనికులను పంపించింది. నియంత్రణ రేఖకు 30 కిలోమీటర్ల దూరంలో బాగ్, కోట్లీ సెక్టార్లలో 2 వేల మందికి పైగా సైనికులను మోహరింపజేసిందని ఇండియన్ ఆర్మీ తెలిపింది. అయితే, ప్రస్తుతం వీరు దాడి చేసే యత్నాల్లో లేరని, అయినా వీరి కదలికలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని పేర్కొంది. కశ్మీర్ లో ఉగ్రకార్యకలాపాలకు మళ్లీ ఆజ్యం పోస్తున్న పాకిస్థాన్... ఇదే సమయంలో బోర్డర్ లో బలగాలను పెంచుతుండటం గమనార్హం.
Pakistan
India
Boarder
PoK
LoC
Army

More Telugu News