విలన్ పాత్రలో హెబ్బా పటేల్
- 'భీష్మ'గా నితిన్
- నాయిక పాత్రలో రష్మిక
- హెబ్బాకి ఛాన్స్ ఇచ్చిన వెంకీ కుడుముల
వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా 'భీష్మ' రూపొందుతోంది. ఈ సినిమాలో నితిన్ సరసన నాయికగా రష్మిక మందన నటిస్తోంది. ఈ సినిమాలో లేడీ విలన్ పాత్ర కీలకంగా వుంటుందట. ఈ పాత్రలో హెబ్బా పటేల్ అయితే బాగుంటుందని భావించి ఆమెను సంప్రదిస్తే వెంటనే ఓకే చెప్పేసిందట. నెగెటివ్ షేడ్స్ కలిగిన ఈ పాత్రలో హెబ్బా ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి మరి.