Ramgopal Varma: ఊరికే అడుగుతున్నాను... 'టీచర్స్' డే సెలబ్రేషన్స్ ఇలాగేనా?: రామ్ గోపాల్ వర్మ

  • మళ్లీ వివాదాస్పద కామెంట్లు చేసిన వర్మ
  • టచర్స్ డేకు, విస్కీకి లింక్
  • తన విషయంలో టీచర్లు విఫలమని వ్యాఖ్య
నిత్యమూ ఏదో ఒక వివాదాస్పద కామెంట్ చేసి వార్తల్లో నలుగుతూ ఉండే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఉపాధ్యాయ దినోత్సవాన్నీ వదల్లేదు. 'టీచర్స్ డే'కు, 'టీచర్స్ విస్కీ'కి లింక్ పెట్టాడు. "ఉపాధ్యాయ దినోత్సవం నాడు టీచర్లు, టీచర్స్ విస్కీ తాగి సెలబ్రేట్ చేసుకుంటారా? ఊరికే అడుగుతున్నాను" అని ఓ ట్వీట్ పెట్టాడు. అంతకుముందు, తనను ఉత్తమ విద్యార్థిగా, మానవతావాదిగా తీర్చిదిద్దడంలో తన టీచర్లు విఫలం అయ్యారని, అందువల్ల తనకు టీచర్స్ డే అంటే ఏంటో తెలియదని అన్నాడు. తాను ఓ చెడు విద్యార్థిననే అనుకున్నా... మంచి ఉపాధ్యాయులకు తనను మంచి విద్యార్థిగా మార్చాలన్న ఆలోచన రాకపోయిందని, అక్కడే టీచర్లు విఫలం అయ్యారని అన్నాడు. దీంతో వారంతా ఉత్తమ ఉపాధ్యాయులు కాలేక పోయారని చెప్పాడు.
Ramgopal Varma
Teachers Day
Wiskey

More Telugu News