సినిమాలో వేషం పేరిట మోసం... పెళ్లి నాటకం!

'ఒక్క అవకాశం...' అంటూ ఎదురు చూస్తున్న ఓ యువతిని నమ్మించి నట్టేట ముంచాడో యువకుడు. రాజమహేంద్రవరం సమీపంలోని బొమ్మూరు పోలీసుల కథనం ప్రకారం, హుకుంపేట సావిత్రీ నగర్ ప్రాంతానికి చెందిన ఓ యువతికి బాలకార్తీక్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. తనకు సినీ పరిశ్రమలోని పెద్దలతో సంబంధాలు ఉన్నాయని, మంచి వేషం ఇప్పిస్తానని నమ్మబలికాడు. దీంతో బాలకార్తీక్ ను నమ్మిన ఆమె, 2017లో అతనితో కలిసి హైదరాబాద్ కు వెళ్లింది. ఆపై ఇద్దరూ ఒకే గదిలో ఉన్నారు. ఆమెకు వేషాలు మాత్రం రాలేదు.

ఈలోగా, ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుందామని చెప్పిన బాలకార్తీక్, యువతిని శారీరకంగా లొంగదీసుకున్నాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి తేవడం ప్రారంభించేసరికి మొహం చాటేయడం మొదలు పెట్టాడు. దీంతో తాను దారుణంగా మోసపోయానని గ్రహించిన ఆమె, బొమ్మూరు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేశామని, విచారిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

Police
Movies
Tollywood
One Chance

More Telugu News