DK Shivakumar: డీకే శివకుమార్ పై బీజేపీ వేధింపులకు కారణం ఇదే: సిద్ధరామయ్య

షార్ట్స్‌లో చూడండి
కర్ణాటక కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ ప్రస్తుతం ఈడీ అదుపులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరనందుకే శివకుమార్ పై ఆ పార్టీ వేధింపులకు పాల్పడుతోందని మండిపడ్డారు. బీజేపీకి భవిష్యత్తులో ప్రజలు గుణపాఠం చెబుతారని అన్నారు. కాంగ్రెస్ నాయకులకు మనుగడ లేకుండా చేసేందుకు బీజేపీ యత్నిస్తోందని చెప్పారు. శివకుమార్ అరెస్ట్ వెనుక ఇంతకు మించి మరో కారణం లేదని తెలిపారు. శివకుమార్ కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని... న్యాయ పోరాటంలో ఆయనను వెన్నంటి ఉంటామని చెప్పారు.

డీకే శివకుమార్ ను అరెస్ట్ చేయించాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి యడియూరప్పకు కూడా తెలుసని... అయినా కావాలనే అరెస్ట్ చేయించారని సిద్ధరామయ్య మండిపడ్డారు. సమన్లు జారీ కావడంతో ఈడీ విచారణ కోసం శివకుమార్ ఢిల్లీ వెళ్లారని... నాలుగు రోజులు విచారించిన తర్వాత అరెస్ట్ చేయడం ముమ్మాటికీ కక్ష సాధింపేనని చెప్పారు. చిదంబరంను అరెస్ట్ చేసిన తర్వాత శివకుమార్ ను టార్గెట్ చేశారని దుయ్యబట్టారు.
Go Back to Shorts
DK Shivakumar
Siddaramaiah
Yediyurappa
BJP
Congress
Karnataka

More Telugu News