Chandrababu: రాజకీయ పునరేకీకరణ కోసమే బీజేపీలోకి.. చంద్రబాబుపై కోపంతో కాదు: రేవూరి

తనకు టీడీపీపైనా, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపైనా ఎలాంటి కోపం, వ్యతిరేకత లేవని ఈ రోజు మధ్యాహ్నం బీజేపీలో చేరిన రేవూరి ప్రకాశ్ రెడ్డి పేర్కొన్నారు. తాను బీజేపీలో చేరింది రాజకీయ పునరేకీకరణ కోసమేనని స్పష్టం చేశారు. బీజేపీ కార్య నిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈ మధ్యాహ్నం ఆయన బీజేపీలో చేరారు. అనంతరం మీడియాతో  మాట్లాడిన రేవూరి.. కేసీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ తన వాక్చాతుర్యంతో తెలుగుదేశం పార్టీని ఆంధ్రా పార్టీ అని ముద్ర వేశారని ఆరోపించారు. ఇక, కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు కునారిల్లుతోందని విమర్శించారు. ఆ పార్టీకి నడిపించే నాయకుడే కరవయ్యాడని అన్నారు. చంద్రబాబే బీజేపీలోకి వలసల్ని ప్రోత్సహిస్తున్నారన్న వార్తల్లో నిజం లేదన్నారు. తెలంగాణకు అన్ని విధాలా న్యాయం చేసిన ఏకైక పార్టీ టీడీపీయేనని రేవూరి స్పష్టం చేశారు.
Chandrababu
Revuri prakash reddy
BJP
KCR

More Telugu News