Jio GigaFiber: జియో గిగా ఫైబర్ రేపే ప్రారంభం.. 15 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు!

  • 100 ఎంబీపీఎస్ నుంచి 1 జీబీపీఎస్ వరకు స్పీడ్
  • రూ. 700 నుంచి రూ. 10 వేల వరకు ఫ్లానులు
  • ఏడాది ప్లాన్ తీసుకునే వారికి ఉచితంగా టీవీ, సెట్ టాప్ బాక్స్
జియో టెలికాం సేవలతో దేశ ముఖ చిత్రాన్నే మార్చివేసిన రిలయన్స్ సంస్థ... జియో గిగా ఫైబర్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. రిలయన్స్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొస్తున్న జియో ఫైబర్ సేవలు రేపు ప్రారంభం కానున్నాయి.

జియో ఫైబర్ లో వివిధ రకాల ఆప్షన్లు ఉన్నాయి. 100 ఎంబీపీఎస్ నుంచి 1 జీబీపీఎస్ స్పీడ్ వరకు ప్లాన్స్ ఉన్నాయి. వీటి నెలవారీ ఛార్జీలు రూ. 700 నుంచి రూ. 10 వేల వరకు ఉన్నాయి. జియో ఫైబర్ 'జియో ఫస్ట్ డే ఫస్ట్ షో' ప్లాన్ ను కూడా అందిస్తోంది. ఈ సదుపాయంతో జియో ఫైబర్ ప్రీమియం కస్టమర్లు కొత్త సినిమాలను థియేటర్ కు వెళ్లకుండానే, ఇంట్లో కూర్చొని వీక్షించవచ్చు. అయితే, ఈ సర్వీస్ వచ్చే ఏడాదిలో అందుబాటులోకి రానుంది.

జియో ఫైబర్ వెల్ కమ్ ఆఫర్ కింద ఏడాది ప్లాన్ ను తీసుకునేవారికి ఫుల్ హెచ్డీ టీవీ లేదా 4కే టీవీ, 4కే సెట్ టాప్ బాక్సులను ఉచితంగా జియో అందించనుంది. జియో ఫైబర్ కోసం 1600 పట్టణాల నుంచి 15 లక్షల మందికి పైగా ఇప్పటికే రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు.
Jio GigaFiber
Reliance
Launch

More Telugu News