Krishna Kousik: అందుకనే మాకు అవకాశాలు తగ్గుతున్నాయి: నటుడు కృష్ణ కౌశిక్

షార్ట్స్‌లో చూడండి
బుల్లితెర నటుడిగా కృష్ణ కౌశిక్ మంచి పేరు తెచ్చుకున్నాడు. చాలా ధారావాహికలలో విభిన్నమైన పాత్రలను చేసిన కౌశిక్, నటుడిగా తన ప్రత్యేకతను చాటుకున్నాడు. అయితే ఇటీవల కాలంలో ఆయనకి అవకాశాలు తగ్గుతూ వస్తున్నాయి. ఈ విషయాన్ని గురించి తాజా ఇంటర్వ్యూలో ఆయన ప్రస్తావించాడు.

"ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో సీరియల్స్ నిర్మించే నిర్మాతకు విలువలేదు. టీవీ ఛానల్స్ లో 'కీ' పోస్టులో వున్నవారు చెప్పినట్టుగా నిర్మాతలు వినాల్సి వస్తోంది. టీవీ సీరియల్స్ నిర్మాతలు తమకి ఇష్టం వచ్చిన ఆర్టిస్టులను పెట్టుకోవడానికి లేదు. ఛానల్ వారు వద్దంటే తీసుకోవడానికి లేదు. ఫలానా ఆర్టిస్టును తీసుకుంటే బాగుంటుందనీ, తన సీరియల్ షూటింగు ఎలాంటి ఆటంకం లేకుండా జరుగుతుందనే విషయం నిర్మాతకి తెలుసు. అయినా ఆయన ఏమీ చేయలేని పరిస్థితి. ఛానల్ వారు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటం వలన అవకాశాలను కోల్పోతున్న ఆర్టిస్టులు వున్నారు. నాలాంటి వారు అవకాశాలు కోల్పోవడానికి ఇదొక కారణం" అని చెప్పుకొచ్చాడు.
Go Back to Shorts
Krishna Kousik

More Telugu News