Andhra Pradesh: అభద్రతా భావంతోనే ఏపీ సర్కారు బైక్ ర్యాలీకి అనుమతి ఇవ్వలేదు!: నారా లోకేశ్ ఆగ్రహం

  • నేడు విశాఖలో నారా లోకేశ్ పర్యటన
  • అయ్యన్నపాత్రుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న నేత
  • లోకేశ్ బైక్ ర్యాలీకి అనుమతి నిరాకరించిన పోలీసులు
తెలుగుదేశం నేత నారా లోకేశ్ బైక్ ర్యాలీని ఈరోజు నర్సీపట్నం పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. టీడీపీ శ్రేణులంతా హెల్మెట్లు పెట్టుకున్నాకే టూ వీలర్ ర్యాలీ నిర్వహించాలని పోలీసులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో నారా లోకేశ్ ప్రభుత్వ తీరుపై తీవ్రంగా స్పందించారు.

ఏపీ ప్రభుత్వం అభద్రతా భావం కారణంగానే తన బైక్ ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు విశాఖలో ఘనస్వాగతం పలికిన టీడీపీ నేతలు, కార్యకర్తలకు లోకేశ్ ధన్యవాదాలు తెలిపారు. అయ్యన్నపాత్రుడు పుట్టినరోజు నేపథ్యంలో ఈరోజు విశాఖపట్నం చేరుకున్న నారా లోకేశ్ పలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
Andhra Pradesh
Telugudesam
Nara Lokesh
Bike rally
Permission denied
Twitter
angry

More Telugu News