Sridevi: సింగపూర్ లో శ్రీదేవి మైనపు విగ్రహం ఆవిష్కరణ.. ఫొటోలు ఇవిగో!

  • సింగపూర్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో విగ్రహావిష్కరణ
  • బంగారు దుస్తులు, కిరీటంతో మెరిసిపోతున్న శ్రీదేవి
  • కార్యక్రమంలో పాల్గొన్న బోనీ కపూర్, జాన్వి
అతిలోక సుందరి శ్రీదేవి మైనపు విగ్రహావిష్కరణ కార్యక్రమం సింగపూర్ లో ఘనంగా జరిగింది. అక్కడి మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీదేవి భర్త బోనీ కపూర్, కూతుళ్లు జాన్వి, ఖుషి పాల్గొన్నారు. బంగారు వస్త్రాలను ధరించి, తలపై కిరీటంతో శ్రీదేవి దివి నుంచి భువికి దిగివచ్చిన దేవకన్యలా మెరిసిపోతోంది. శ్రీదేవి, అనిల్ కపూర్ కాంబినేషన్లో 1987లో వచ్చిన 'మిస్టర్ ఇండియా' చిత్రంలోని 'హవా హవాయి' పాట లుక్ ఆధారంగా ఈ విగ్రహాన్ని రూపొందించారు.
Sridevi
Wax Figurine
Madame Tussauds
Singapore
Bollywood
Tollywood

More Telugu News