Andhra Pradesh: నారా లోకేశ్ కు నర్సీపట్నం పోలీసుల షాక్.. బైక్ ర్యాలీకి అనుమతి నిరాకరణ!

  • హెల్మెట్లు ధరించాలని టీడీపీ శ్రేణులకు సూచన
  • నిరసనగా కాలినడకన బయలుదేరిన లోకేశ్
  • వాహనాలు నడుపుకుంటూ వెంట నడిచిన టీడీపీ శ్రేణులు
తెలుగుదేశం సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు పుట్టినరోజు నేపథ్యంలో టీడీపీ నేత నారా లోకేశ్ ఈరోజు విశాఖకు చేరుకున్నారు. జిల్లాలోని నర్సీపట్నంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న లోకేశ్ నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించారు.

అయితే ఈ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. టూవీలర్ ర్యాలీ చేపట్టాలంటే అందరూ హెల్మెట్ ధరించాల్సిందేనని స్పష్టం చేశారు. దీంతో పోలీసుల తీరుకు నిరసనగా నారా లోకేశ్ కాలినడకన ఎన్టీఆర్ ఆసుపత్రి వద్దకు బయలుదేరగా, టీడీపీ శ్రేణులు వాహనాలను నడిపించుకుంటూ ఆయన వెంట నడుస్తున్నారు.
Andhra Pradesh
Nara Lokesh
Ayyanna Patrudu
Birthday
Bike rally
Permission Denied
Police
Visakhapatnam District
Narsipatnam

More Telugu News