Amaravati: అమరావతిలో ఆర్థిక అద్భుతాలు: కేశినేని నాని సెటైర్!

  • అమరావతి అవకాశాలను కోల్పోతోంది
  • మాంద్యం ఏర్పడితే ఆర్థిక సమతుల్యత తప్పనిసరి
  • అమరావతిలో పరిస్థితి వేరన్న నాని
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైఖరి వల్ల ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఎన్నో అవకాశాలను కోల్పోతుందని అంటూ విజయవాడ ఎంపీ కేశినేని నాని విమర్శలు గుప్పించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, "ఆర్థిక మాంద్యం ఏర్పడిన సమయంలో ఏ దేశమైనా ఉద్దీపన ప్యాకేజీలతో వ్యయ నిర్వహణకు ఊతమిస్తుంది. తద్వారా ఆర్థిక పరిస్థితులను సమతుల్యం చేస్తుంది. ఇక అమరావతి నిర్మాణం విషయానికి వస్తే, ఇక్కడ ఆర్థిక అద్భుతాలు జరుగుతున్నాయి. ఇవన్నీ అవకాశాలను దూరం చేస్తున్నాయి" అని సెటైర్ వేశారు.
Amaravati
Kesineni Nani
Twitter

More Telugu News