KTR: ఈటల పేరెత్తకుండా విరుచుకుపడిన కేటీఆర్!

  • ఈటల రాజేందర్‌కు కేటీఆర్ కౌంటర్
  • అందరికీ ప్రజలే బాసులన్న కేటీఆర్
  • పెద్దపెద్ద మాటలు మాట్లాడొద్దని హితవు
గులాబీ జెండాకు ఓనర్లం తామేనని, తనకొచ్చిన మంత్రి పదవి ఎవరో వేస్తే వచ్చిన భిక్ష కాదంటూ తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపాయి. రాజేందర్ వ్యాఖ్యలను కొందరు టీఆర్ఎస్ నేతలు ఖండించారు కూడా. తాజాగా ఈటల వ్యాఖ్యలపై ఆ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు.

ఈటల పేరెత్తకుండా విమర్శలు గుప్పించారు. పదవులు రాగానే కొందరు నేతలు పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని, పదవులు వచ్చింది పార్టీ వల్లేననే విషయాన్ని గుర్తుంచుకోవాలని చురకలు అంటించారు. అందరికీ ప్రజలే బాసులనే విషయాన్నిగుర్తుపెట్టుకుని మసలుకోవాలని హితవు పలికారు. ఈటల రాజేందర్‌ను ఉద్దేశించే కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
KTR
Etela Rajender
TRS

More Telugu News