Chandrababu: ఆంధ్రా బ్యాంక్ విలీనాన్ని తెలుగు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు: చంద్రబాబు

  • ఆంధ్రా బ్యాంక్ విలీనంపై కేంద్రం ప్రకటన!
  • కనీసం పేరునైనా కొనసాగించాలని చంద్రబాబు విజ్ఞప్తి
  • కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. ఆంధ్రా బ్యాంక్ విలీనాన్ని తెలుగు ప్రజలు స్వాగతించలేకపోతున్నారంటూ లేఖలో స్పష్టం చేశారు. విలీనం అనివార్యమైతే ఆంధ్రా బ్యాంక్ పేరునే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్థిక వ్యవస్థలను గాడిన పెట్టేందుకు తీసుకున్న చర్యలు అభినందనీయం అంటూ తన లేఖలో ఆర్థిక మంత్రిని ప్రశంసించారు. ప్రభుత్వ సంస్కరణలు పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంచుతాయని తెలిపారు.

కొన్నిరోజుల క్రితం నిర్మలా సీతారామన్ ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనంపై ఓ ప్రెస్ మీట్ లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆంధ్రా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం అవుతాయని ఆమె తెలిపారు. దీనిపై తెలుగు రాష్ట్రాల ప్రముఖుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆంధ్రా బ్యాంక్ పేరును మాత్రం తొలగించవద్దని అత్యధికులు కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
Chandrababu
Andhra Pradesh
Andhra Bank
Nirmala Sitharaman

More Telugu News