Revanth Reddy: కుటుంబసభ్యులతో కలసి సోనియాగాంధీని కలిసిన రేవంత్ రెడ్డి

  • భార్య, కుమార్తె, అల్లుడితో కలసి సోనియాను కలిసిన రేవంత్
  • మర్యాదపూర్వకంగానే కలిసినట్టు సమాచారం
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తన కుటుంబసభ్యులతో కలసి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కలిశారు. సోనియాను కలిసిన వారిలో ఆయన భార్య, కూతురు, అల్లుడు ఉన్నారు. మర్యాదపూర్వకంగానే వీరు సోనియాను కలిసినట్టు సమాచారం. హైదరాబాద్ మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి రేవంత్ రెడ్డి ఎంపీగా గెలుపొందారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో... అదే బాటలో నడిచిన రేవంత్ రెడ్డి టీకాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేశారు. సోనియాను రేవంత్ కుటుంబ సభ్యులు కలిసిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Revanth Reddy
Sonia Gandhi
Congress

More Telugu News