Buddha Venkanna: మద్యపాన నిషేధం స్కామ్ సూపర్ గా ఉంది 420 తాతయ్యా... బుద్ధా వెంకన్న సెటైర్లు!

  • కొత్త మద్యం దుకాణాల్లో ఏదైనా కంపెనీ బ్రాండ్ అమ్మాలంటే 2శాతం J-ట్యాక్స్ తప్పనిసరి అంటూ ఆరోపణలు
  • మద్యం దుకాణాల్లో ఉద్యోగాలు వైసీపీ కార్యకర్తలకేనంటూ విమర్శలు
  • ట్విట్టర్ లో స్పందించిన బుద్ధా వెంకన్న
టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఏపీ ప్రభుత్వం అమలుచేయతలపెట్టిన మద్యనిషేధంపై స్పందించారు. కొత్తగా ఏర్పాటు చేసే మద్యం దుకాణాలను వైసీపీ నాయకులకు చెందిన షాపుల్లోనే నెలకొల్పుతున్నారని, జగనన్న మద్యం దుకాణాల్లో వైసీపీ కార్యకర్తలకే ఉద్యోగాలు ఇస్తున్నారని బుద్ధా ఆరోపించారు. నూతన మద్యం దుకాణాల్లో ఏదైనా కంపెనీకి చెందిన బ్రాండ్ అమ్మకానికి పెట్టాలంటే 2 శాతం J-ట్యాక్స్ తప్పనిసరి అని ట్వీట్ చేశారు. సూపర్ గా ఉంది 420 తాతయ్యా మీ మద్యపాన నిషేధం స్కామ్ అంటూ పరోక్షంగా విజయసాయిరెడ్డిపై సెటైర్ వేశారు.
Buddha Venkanna
Vijay Sai Reddy
Jagan

More Telugu News