Pawan Kalyan: ఇలాంటి కార్యకర్తలు ప్రపంచంలో ఏ పార్టీకి ఉండరు: నాగబాబు

  • అభిమానులకు వినాయకచవితి శుభాకాంక్షలు, పవన్ కు పుట్టినరోజు విషెస్ చెప్పిన  మెగా బ్రదర్
  • జనసేన క్యాడర్ ఎంతో బలంగా ఉందంటూ వ్యాఖ్యలు
  • ఇలాంటి కార్యకర్తలు ప్రపంచంలో ఏ పార్టీకి ఉండరని వెల్లడి
వినాయకచవితి సందర్భంగా మెగా బ్రదర్ నాగబాబు తన అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేగాకుండా, ఇవాళ తన సోదరుడు పవన్ కల్యాణ్ పుట్టినరోజు కూడా కావడంతో విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనసేన కార్యకర్తలు పార్టీ కోసం రూ.100 కోట్లు విరాళాలు సేకరించాలన్న నిర్ణయం తీసుకోవడం ఎంతో సంతోషం కలిగిస్తోందని, ఓ పార్టీకి ఇలాంటి అభిమానులు ఉండడం తనను నిజంగా విస్మయానికి గురిచేసిందని అన్నారు.

జనసేన కార్యకర్తలు రూ.100 కోట్ల విరాళాలు సేకరించడం కంటే ఆ నిర్ణయమే చాలా గొప్పదని నాగబాబు అభిప్రాయపడ్డారు. జనసేన పార్టీ ఎంతో బలంగా ఉందన్న విషయం కార్యకర్తల అభిమానం చూస్తే అర్థమవుతుందని తెలిపారు. డబ్బు, ఇతర ప్రలోభాలతో ఇలాంటి కార్యకర్తలు రారని, ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి కార్యకర్తలు ఉండరని నాగబాబు కొనియాడారు.
Pawan Kalyan
Jana Sena
Nagababu

More Telugu News