India: భారత్ కు దౌత్యపరమైన విజయం... జైల్లో కుల్ భూషణ్ జాదవ్ ను కలిసిన డిప్యూటీ హైకమిషనర్

  • ఎట్టకేలకు భారత్ కు దౌత్యపరమైన అనుమతులు లభ్యం
  • కుల్ భూషణ్ తో మాట్లాడిన గౌరవ్ అహ్లూవాలియా
  • గూఢచర్యం ఆరోపణలతో పాక్ జైల్లో మగ్గిపోతున్న కుల్ భూషణ్
గూఢచర్యం ఆరోపణలపై పాకిస్థాన్ నిర్బంధంలో ఉన్న మాజీ నేవీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ ను కలిసేందుకు ఎట్టకేలకు భారత్ కు దౌత్యపరమైన అనుమతులు లభించాయి. ఈ క్రమంలో భారత డిప్యూటీ హైకమిషనర్ గౌరవ్ అహ్లూవాలియా కొద్దిసేపటి క్రితం పాక్ జైల్లో మగ్గిపోతున్న కుల్ భూషణ్ జాదవ్ ను కలిశారు. కుల్ భూషణ్ యోగక్షేమాలు కనుక్కొన్న అహ్లూవాలియా, అతడిపై ఉన్న ఆరోపణలు, వాటి విచారణ, ఇటీవల ఐసీజే కేసు తీర్పు వంటి విషయాలను చర్చించారు.

కాగా, కుల్ భూషణ్ కు దౌత్యపరమైన మద్దతు అందించడంలో ఇది కీలక పరిణామంగా భావిస్తున్నారు. తమదేశంలో గూఢచర్యం చేస్తున్నాడంటూ పాక్ కుల్ భూషణ్ ను అదుపులోకి తీసుకుని ఏకపక్ష విచారణతో మరణశిక్ష విధించింది. అయితే, అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పుతో వెనక్కి తగ్గింది.
India
Pakistan
Kulbhushan Jhadav

More Telugu News