Uttar Pradesh: యూపీ గవర్నర్‌ ఆనందీబెన్‌ దూకుడు.. ఆకస్మిక తనిఖీలతో అధికారుల హడల్‌

షార్ట్స్‌లో చూడండి
గుజరాత్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం కదా... తనదైన కొత్త మార్గంలో ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ అధికారులను హడలగొడుతున్నారు. రెండు రోజుల క్రితం బారాబంకి జిల్లాలోని ఓ బాలికల పాఠశాలను సందర్శించారు. అక్కడి బాలికలతో మాట్లాడారు.

‘బాలికలు అన్ని సందర్భాల్లోనూ ధైర్యంగా ఉండాలి. ఆత్మరక్షణ కోసం ఎట్టిపరిస్థితుల్లోనూ ఇతరులపై ఆధారపడకూడదు. అమ్మాయిలను కించపరిచే విధంగా ఏ అబ్బాయి అయినా మాట్లాడితే ఎదురు తిరగండి. వాడిపై రాళ్లతో దాడి చేయండి’ అంటూ సూచించారు. ఆ తర్వాత ఓ అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లి పిల్లలతో ముచ్చటించారు. బర్లాంపూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి ప్రభుత్వ వైద్య పథకాల అమలు తీరుపై ఆరాతీశారు. ఇలా ఆనందీబెన్‌ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తుండంతో అధికారులు బెంబేలెత్తుతున్నారు.
Go Back to Shorts
Uttar Pradesh
governor
anandibenpatel
visits

More Telugu News