Intruder: పార్లమెంటులోకి కత్తితో వ్యక్తి ప్రవేశం.. అదుపులోకి తీసుకున్న పోలీసులు!

  • ఉగ్ర హెచ్చరికల నేపథ్యంలో హైఅలర్ట్
  • గేట్ నంబర్ 1లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నం
  • విచారణ జరుపుతున్న ఢిల్లీ పోలీసులు
ఉగ్రహెచ్చరికలతో దేశమంతా అప్రమత్తంగా ఉన్నవేళ పార్లమెంటు వద్ద ఈరోజు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కట్టుదిట్టమైన భద్రత ఉండే పార్లమెంటులోకి ఓ వ్యక్తి బైక్ పై దూసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ సందర్భంగా నిందితుడిని అడ్డుకున్న పోలీసులు, అతని నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నారు. 2001, డిసెంబర్ 13న లష్కరే ఉగ్రవాదులు ఇదే గేటు(గేటు నంబర్ 1) నుంచి పార్లమెంటులోకి దూసుకెళ్లి దాడికి పాల్పడ్డారు.

జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు విషయంలో దేశంలో హైఅలర్ట్ కొనసాగుతున్న వేళ ఓ వ్యక్తి కత్తి తీసుకుని పార్లమెంటులోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంపై ఆందోళన నెలకొంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు.. విచారణ జరుపుతున్నారు.
Intruder
tried
to enter
the
Parliament

More Telugu News