India: కశ్మీరీల కోసం తల్వార్ పడతా.. పాక్ మాజీ క్రికెటర్ జావెద్ మియాందాద్ నోటి దురుసు!

షార్ట్స్‌లో చూడండి
జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక హోదా, స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని ఇటీవల పార్లమెంటు రద్దుచేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లడఖ్ ల పేరిట రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టింది. దీంతో ఇంతకాలం జమ్మూకశ్మీర్ లో వేర్పాటువాదాన్ని రెచ్చగొట్టిన పాకిస్థాన్ అగ్గిమీదగుగ్గిలం అవుతోంది. కశ్మీర్ కోసం తుదకంటూ పోరాడుతామని బీరాలు పలుకుతోంది. తాజాగా ఈ జాబితాలో పాక్ మాజీ క్రికెటర్ జావెద్ మియాందాద్ కూడా చేరిపోయాడు. భారత్ ను రెచ్చగొట్టేలా నోటి దురుసు వ్యాఖ్యలు చేశాడు.

 పాక్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మియాందాద్ మాట్లాడుతూ.. ‘కశ్మీరీ సోదరులారా.. భయపడకండి. నేను మీకు అండగా ఉంటాను. బ్యాట్ పట్టి సిక్స్ కొట్టినవాడిని. తల్వార్ తో మనిషిని చంపలేనా?’ అని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అన్నట్లు మాఫియాడాన్ దావూద్ ఇబ్రహీం కుమార్తెను ఈ జావెద్ మియాందాద్ కుమారుడికి 2006లో ఇచ్చి పెళ్లి చేశారు.
Go Back to Shorts
India
Pakistan
javed miandad
talwar comments
killings
Jammu And Kashmir
Article 370

More Telugu News