Saaho: సాహో ఫ్లాప్ అన్నందుకు తరణ్ ఆదర్శ్ కు తలంటుతున్న నెటిజన్లు!

  • సాహో భరించలేని చిత్రం అంటూ తరణ్ ఆదర్శ్ ట్వీట్
  • ట్రోలింగ్ మొదలుపెట్టిన నెటిజన్లు
  • డిజాస్టర్లకు ఫోర్ స్టార్ రేటింగ్ ఇచ్చిన ఘనత తరణ్ ఆదర్శ్ దేనంటూ విమర్శలు
బాలీవుడ్ లో ప్రముఖ సినీ విమర్శకుడిగా కొనసాగుతున్న తరణ్ ఆదర్శ్ సాహో చిత్రంలో ఇచ్చిన రివ్యూ పట్ల ప్రభాస్ అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రభాస్ ఎంతో మనసు పెట్టి నటించిన సినిమా సాహోకు ఒక్క స్టార్ ఇవ్వడం పట్ల ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనయ్యారు. అయితే, తరణ్ ఆదర్శ్ కు సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.

ఫ్లాప్ చిత్రంగా ముద్రపడిన ప్రేమ్ రతన్ ధన్ పాయో చిత్రానికి 4.5 స్టార్ రేటింగ్ ఇవ్వడం తరణ్ ఆదర్శ్ కే చెల్లిందంటూ ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు. సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన మరో చిత్రం భరత్ ఓ డిజాస్టర్ గా నిలిస్తే, ఆ సినిమాకు 4 స్టార్లు ఇచ్చి స్మాష్ హిట్ అని తరణ్ ఆదర్శ్ పేర్కొన్న ట్వీట్ ను ఓ అభిమాని రీట్వీట్ చేశాడు. ఇంతకీ శంకర్ నుంచి ఎంత డబ్బు తీసుకున్నావు అంటూ మరో అభిమాని ప్రశ్నించాడు.

నీకు సౌతిండియా సినిమాలు నచ్చవని, ఎక్కడ బాలీవుడ్ సినిమాలను సౌత్ సినిమాలు అధిగమిస్తాయోనని నీకు అసూయ అంటూ మరో నెటిజన్ ఘాటుగా స్పందించాడు. పేమెంట్ వర్కౌట్ అయితే అది ఎమోషనల్ జర్నీనా, పేమెంట్ వర్కౌట్ కాకపోతే భరించలేని జర్నీనా అంటూ మరికొందరు ఏకిపారేశారు. భరత్ చిత్రానికి తరణ్ ఆదర్శ్ ఎమోషనల్ జర్నీ అంటూ ట్వీట్ చేశాడు. ఇప్పుడు సాహో చిత్రానికి భరించలేని చిత్రం అంటూ రివ్యూ ఇచ్చాడు.
Saaho
Prabhas
Taran Adarsh

More Telugu News