KTR: పదేళ్లు మాకు పెద్ద దిక్కులా ఉన్నారు... నరసింహన్ వెళ్లిపోతుండడం పట్ల కేటీఆర్ స్పందన

  • తెలంగాణ నూతన గవర్నర్ గా తమిళసై
  • తెలంగాణ గవర్నర్ గా ముగిసిన నరసింహన్ ప్రస్థానం
  • ట్విట్టర్ లో స్పందించిన కేటీఆర్
తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం కొత్త గవర్నర్ ను నియమించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు రాష్ట్ర గవర్నర్ గా ఉన్న ఈఎస్ఎల్ నరసింహన్ స్థానంలో తమిళసై సౌందరరాజన్ తెలంగాణ నూతన గవర్నర్ గా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో, నరసింహన్ వెళ్లిపోతుండడం పట్ల టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భావోద్వేగాలకు గురయ్యారు. ట్విట్టర్ లో తన స్పందన వ్యక్తం చేశారు.

"ఎన్నోసార్లు అనేక అంశాలపై మీతో సంభాషించే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను నరసింహన్ గారూ! గత పదేళ్లుగా రాష్ట్రానికి పెద్ద దిక్కులా నిలబడి మార్గదర్శనం చేసినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సర్. మీకు భవిష్యత్తులో మంచి ఆరోగ్యం, సుఖసంతోషాలు కలగాలని కోరుకుంటున్నాం" అంటూ ట్వీట్ చేశారు.
KTR
ESL Narasimhan

More Telugu News