Amaravathi: అమరావతిని తరలించ ఎవరి తరం? తరలించగలం అనుకుంటే అది మీ భ్రమ!: వర్ల రామయ్య

  • రాజధాని అంశంపై వర్ల రామయ్య ట్వీట్
  • ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన కర్మభూమి అమరావతి అంటూ వ్యాఖ్యలు
  • అమరావతిని కదిలించగలం అనుకుంటే అది వారి భ్రమేనంటూ వెల్లడి
రాష్ట్ర రాజధాని మార్పు అంశం ఏపీలో ఇంకా చర్చనీయాంశంగానే ఉంది. సీఎం జగన్ ఇంతవరకు దీనిపై స్పందించకపోగా, మంత్రులు అడపాదడపా వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. అటు, ఈ వివాదానికి ఆద్యుడు బొత్స సత్యనారాయణ సైతం వ్యాఖ్యానం వినిపిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో, టీడీపీ నేత వర్ల రామయ్య రాజధాని మార్పు అంశంపై ట్విట్టర్ లో స్పందించారు. ఏపీ రాజధాని అమరావతి సాక్షాత్తు దేశప్రధాని శంకుస్థాపన చేసిన కర్మభూమి అని పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా వేలాది ఆలయాలు, గ్రామదేవతల పుణ్యక్షేత్రాల నుంచి తీసుకువచ్చిన మట్టి, నీటితో పునీతమైన పుణ్యభూమి అని, సకల దేవతల ఆశీస్సులు అందుకున్న పవిత్రస్థలం అని పేర్కొన్నారు. ఇంతటి మహిమాన్విత అమరావతిని కదిలించడం ఎవరి తరం అయినా అవుతుందా? అంటూ ప్రశ్నించారు. ఒకవేళ అమరావతిని తరలించగలం అనుకుంటే అది వారి 'భ్రమ' మాత్రమేనంటూ వ్యాఖ్యానించారు.
Amaravathi
Telugudesam
YSRCP
Botsa Satyanarayana
Jagan

More Telugu News