Mahesh Babu: కొడుకు పుట్టినరోజు సందర్భంగా వెరైటీగా శుభాకాంక్షలు తెలిపిన మహేశ్ బాబు

  • టీనేజ్ ప్రాయంలో అడుగుపెట్టిన మహేశ్ బాబు తనయుడు గౌతమ్
  • 13వ పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ విషెస్ తెలిపిన మహేశ్
  • నువ్విప్పుడు అధికారికంగా టీనేజర్ అయ్యావు అంటూ గౌతమ్ కు మెసేజ్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తన కుమారుడు గౌతమ్ 13వ పుట్టినరోజు సందర్భంగా వినూత్నరీతిలో శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ లో స్పందించిన మహేశ్ బాబు, 13 (Thirteen) ఆంగ్ల పదంలోని మొదటి అక్షరాలతో వచ్చే పదాలను ఉపయోగించి ముద్దుల తనయుడి గుణగణాలను వర్ణించారు. T (టాలెంటెడ్), H (హ్యూమరస్), I (ఇన్నోసెంట్), R (రైటౌస్), T (టఫ్), E (ఎనర్జటిక్), E (ఎక్సెప్షనల్), N (నాటీ) అంటూ ట్విట్టర్ లో పోస్టు చేశారు. "13వ జన్మదిన శుభాకాంక్షలు గౌతమ్. ఇప్పుడు నువ్వు అధికారికంగా టీనేజర్ వయ్యావు. ఇక నీ కౌమార దశను సరదాలు, సాహసాలతో వేడుక చేసుకో" అంటూ మహేశ్ తన సందేశాన్ని వెలువరించారు.
Mahesh Babu
Gautam
Tollywood

More Telugu News