Pawan Kalyan: కులం రంగు పులిమి రాజధానిని వేరే చోటకు తరలిస్తామంటే ఊరుకునేది లేదు: పవన్ కల్యాణ్

  • మంగళగిరిలో జనసేన బహిరంగ సభ
  • ఆవేశంతో ప్రసంగించిన పవన్ కల్యాణ్
  • పెద్ద ఎత్తున సభకు హాజరైన రాజధాని రైతులు
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మంగళగిరిలో పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సభలో రాజధాని ప్రాంత రైతులను ఉద్దేశించి పవన్ ఆవేశంతో ప్రసంగించారు. రాజధాని రైతులు భూములు ఇచ్చింది వ్యక్తులకు కాదని, వారు భూములిచ్చింది ప్రభుత్వానికని అన్నారు. భూములు ఇచ్చిన ప్రతి రైతుకు న్యాయం జరిగేంత వరకు జనసేన అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అమరావతిలో బీసీలు, ఎస్సీలు కూడా ఉన్నారని, రాజధానికి కులం రంగు పులిమి మరో ప్రాంతానికి తరలిస్తామంటే కుదరదని వ్యాఖ్యానించారు.

గత ప్రభుత్వంలో వ్యక్తులు తప్పుచేసి ఉంటే వారిపై విచారణ జరపాలే తప్ప, రాజధాని విషయంలో గందరగోళం సృష్టించే ప్రకటనలు చేయడం సరికాదని హితవు పలికారు. ప్రధాని మోదీకి తెలిసే అమరావతి ఏర్పాటైందని, కేంద్రం కూడా అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేయడం కోసం రూ.1500 కోట్లు ఇచ్చిందని పవన్ గుర్తు చేశారు.
Pawan Kalyan
Jana Sena
Amaravathi

More Telugu News