Kamal Haasan: టీవీ చానల్ పెడుతున్న కమలహాసన్

  • ప్రజల్లోకి పార్టీని బలంగా తీసుకెళ్లాలని భావిస్తున్న కమల్
  • రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తో సంప్రదింపులు
  • నవంబర్ 7 నుంచి ఎన్నికల ప్రచారానికి సన్నాహాలు!
సినీ నటుడు, ఎంఎన్ఎం (మక్కళ్ నీది మయ్యం) పార్టీ అధ్యక్షుడు కమలహాసన్ త్వరలోనే టీవీ చానల్ స్థాపించబోతున్నారు. నవంబర్ 7న కమల్ పుట్టినరోజు. తన జన్మదినం సందర్భంగా పార్టీ కోసం ఆయన చానల్ ప్రారంభిస్తారని ప్రచారం జరుగుతోంది. ఎంఎన్ఎం పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి బలోపేతం చేయాలంటే టీవీ చానల్ తప్పనిసరి అని కమల్ భావిస్తున్నారు. కాగా, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో పార్టీ బాణీని వినిపించేందుకు చానల్ ఉపయుక్తంగా ఉంటుందన్నది పార్టీ వర్గాల యోచన.

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తో సంప్రదింపులు జరుపుతున్న కమల్ ఆయన సూచనల మేరకే టీవీ చానల్ ప్రారంభిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తన పుట్టినరోజున ఎన్నికల ప్రచారం ప్రారంభించేందుకు కమల్ సన్నాహాలు చేస్తున్నారు.
Kamal Haasan
TV

More Telugu News