Sikh Girl: మా సోదరి ఇప్పటి వరకు ఇంటికి రాలేదు.. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు: పాకిస్థాన్ సిక్కు బాలిక సోదరుడు

  • జగ్జీత్ కౌర్ కు మతం మార్పించి బలవంతంగా పెళ్లాడిన యువకుడు
  • బాధితురాలిని కుటుంబసభ్యులకు అప్పగించారంటూ వార్తలు
  • ఇవన్నీ తప్పుడు వార్తలేనన్న ఆమె సోదరుడు
పాకిస్థాన్ లోని సిక్కు బాలిక జగ్జీత్ కౌర్ ను ఓ ముస్లిం వ్యక్తి కిడ్నాప్ చేసి, మతం మార్పించి, బలవంతంగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. నిందితులను అరెస్ట్ చేయాల్సిందిగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆదేశాలు జారీ చేశారని, ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారని, బాధితురాలు క్షేమంగా ఇంటికి చేరుకుందనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఆ అమ్మాయి ఇంత వరకు ఇంటికి చేరుకోలేదు, ఈ విషయాన్ని ఆమె సోదరుడు వెల్లడించాడు.

'నా సోదరి ఇంత వరకు ఇంటికి తిరిగి రాలేదు. ఆమెను మాకు అప్పగించినట్టు సోషల్ మీడియాలో ఓ వీడియో ద్వారా ప్రచారం జరుగుతోంది. ఆమెను మాకు ఎవరూ ఇంత వరకు అప్పగించలేదు. అంతేకాదు, ఈ ఘటనకు సంబంధించి ఇంత వరకు ఒకరిని కూడా అరెస్ట్ చేయలేదు. ఇవన్నీ ఫేక్ న్యూస్' అంటూ బాధితురాలి సోదరుడు తెలిపాడు. తన సోదరి గురించి ఇంత వరకు ఎలాంటి సమాచారం లేదని... ఇంత వరకు తమకు ఎలాంటి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తమకు న్యాయం చేయాలని ప్రధాని ఇమ్రాన్ ఖాన్, పంజాబ్ (పాకిస్థాన్) గవర్నర్ లను కోరుతున్నామని చెప్పాడు.
Sikh Girl
Pakistan

More Telugu News