Vijay Sai Reddy: పెంపుడు కుక్కలన్నింటినీ గొలుసులు విప్పేశారు తండ్రీకొడుకులు... ఉస్కో అంటే వాటికి మొరగటమొక్కటే తెలుసు: విజయసాయిరెడ్డి

  • ఘాటు వ్యాఖ్యలతో రెచ్చిపోయిన విజయసాయిరెడ్డి
  • చంద్రబాబు ఇసుక మాఫియాను పెంచిపోషించారంటూ వ్యాఖ్యలు
  • బడితె పూజ తప్పదంటూ వ్యంగ్యం
వైసీపీ అగ్రనేత, రాజ్యసభ సభ్యుడు రాష్ట్రంలో తాజా పరిణామాలపై తనదైన శైలిలో స్పందించారు. చంద్రబాబు పెంచిపోషించిన ఇసుక మాఫియా కలుగులోంచి బయటపడ్డ ఎలుకలా గిలగిలా కొట్టుకుంటోందని వ్యాఖ్యానించారు. కానీ చంద్రబాబు మాత్రం కార్మికులు ఉపాధి కోల్పోయారంటూ దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని ట్విట్టర్ లో ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేత అయివుండీ రియల్ ఎస్టేట్ వ్యాపారిలా తాటాకు చప్పుళ్లు చేయిస్తున్నారని విజయసాయి విమర్శించారు.

ఇంట్లో కట్టేసిన పెంపుడు కుక్కలన్నింటినీ తండ్రీకొడుకులు గొలుసులు విప్పి వదిలేశారని, అవి దారినపోయే వాళ్ల వెంటపడుతున్నాయంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. ఆయన ఉస్కో అంటే మొరగటమొక్కటే వాటికి తెలుసని తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఆ కుక్కలను తరిమికొట్టిన తర్వాత తమకు బడితె పూజ తప్పదని మర్చిపోయినట్టున్నారంటూ చంద్రబాబు, నారా లోకేశ్ లను ట్యాగ్ చేస్తూ ట్వీట్ ముగించారు.
Vijay Sai Reddy
Chandrababu
Nara Lokesh
Jagan
Andhra Pradesh

More Telugu News