బాలీవుడ్ హిట్ మూవీ రీమేక్ లో నితిన్
- హిందీలో హిట్ కొట్టిన 'అంధాదున్'
- నితిన్ తండ్రి చేతికి తెలుగు రీమేక్ రైట్స్
- వచ్చే ఏడాదిలో సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్
ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే నాయకా నాయికలుగా నటించిన ఈ సినిమాలో 'టబు' ఓ ముఖ్యమైన పాత్రను పోషించింది. అలాంటి ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కుల కోసం బడా నిర్మాతలు పోటీ పడ్డారు. ఈ పోటీలో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి తెలుగు రీమేక్ రైట్స్ ను దక్కించుకున్నాడు. వయాకామ్ 18 వారు కూడా నిర్మాణ భాగస్వాములుగా ఉండనున్నారు. ప్రస్తుతం నితిన్ చేస్తోన్న 'భీష్మ' .. 'రంగ్ దే' సినిమాలు పూర్తయిన తరువాత, ఆయన హీరోగా 'అంధాదున్' రీమేక్ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.