Saaho: కాపీ కొట్టారు.. అంటూ 'సాహో' దర్శకనిర్మాతలపై మండిపడ్డ లీసా రే

  • షిలో ఆర్ట్ ను కాపీ కొట్టిన దర్శకనిర్మాతలు
  • ఇతరుల క్రియేటివిటీని దొంగిలించారన్న లీసా రే
  • ఆమె అనుమతి కూడా తీసుకోలేదని మండిపాటు
ప్రభాస్ తాజా చిత్రం 'సాహో' దర్శక నిర్మాతలపై సినీ నటి లీసా రే తీవ్ర విమర్శలు గుప్పించింది. ఇన్స్టాగ్రామ్ వేదికగా మండిపడింది. సమకాలీన చిత్రకారిణి షిలో శివ్ సులేమాన్ ఆర్ట్ ను వారి పోస్టర్లలో కాపీ కొట్టారని ఆరోపించింది. ఒక ఒరిజినల్ ఆర్ట్ వర్క్ తో పాటు ప్రభాస్, శ్రద్ధా కపూర్ లు ఉన్న పోస్టర్ ను షేర్ చేసింది.

'ఇలాంటి వాటిపై మనం స్పందించాల్సిన అవసరం ఉంది. కాపీ కొట్టడం సరికాదనే విషయం మూవీ మేకర్స్ కు తెలియాలి. ఇది ముమ్మాటికీ ఇతరుల క్రియేటివిటీని చోరీ చేయడమే. ఇలాంటివి ఏ మాత్రం అంగీకరించేవి కాదు. కనీసం షిలోను సంప్రదించలేదు కూడా. ఆమె అనుమతిని తీసుకోవడం కానీ, లేదా ఆమెకు క్రెడిట్ ఇవ్వడం కానీ చేయలేదు' అని లీసా రే మండిపడింది. మీ ఇంట్లోకి ఎవరైనా చొరబడి మీకు అత్యంత విలువైన వస్తువును దొంగిలిస్తే... మీకు ఎలా ఉంటుంది? అని ప్రశ్నించింది.
Saaho
Prabhas
Lisa Ray
Shilo Shiv Suleman
Bollywood
Tollywood

More Telugu News