Andhra Pradesh: ఇసుక విధానంలో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం

  • టెండర్లను రద్దు చేసిన ప్రభుత్వం
  • అతి తక్కువ ధరకు టెండర్లు కోట్ చేయడంతో కీలక నిర్ణయం
  • జీపీఎస్ ఉన్న ట్రక్కుల యజమానులకు అవకాశం
కొత్త ఇసుక విధానంలో రవాణా టెండర్లను రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నిన్న అర్ధరాత్రి రాష్ట్ర గనుల శాఖ ఆదేశాలు జారీ చేసింది. కిలోమీటర్ కు ఇసుక తరలింపుకు అతి తక్కువ ధర కోట్ చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది. జిల్లా మొత్తానికి ఒకే కాంట్రాక్టర్ ఉంటే ఇబ్బందులు వస్తాయని ప్రభుత్వం భావించింది. మరోవైపు, జీపీఎస్ ఉన్న ట్రక్కుల యజమానులు దరఖాస్తు చేసుకుంటే... వారికి అవకాశం ఇస్తామని తెలిపింది. కిలోమీటరు రవాణాకు రూ. 4.90 ఖరారు చేసినట్టు వెల్లడించింది.  

Andhra Pradesh
Sand Policy
Tenders

More Telugu News