Rajinikanth: తనను సోలో హీరోగా పరిచయం చేసిన నిర్మాతకు కోటి రూపాయలతో స్వగృహయోగం కల్పించిన రజనీకాంత్!

  • రజనీకాంత్ తో భైరవి చిత్రం నిర్మించిన కలైజ్ఞానం
  • ఇప్పటికీ అద్దె ఇంట్లోనే కాలం గడుపుతున్న నిర్మాత
  • కలైజ్ఞానంకు కొత్త ఇల్లు తాను కొనిస్తానన్న తలైవా
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తొలిసారి సోలో హీరోగా వచ్చిన చిత్రం భైరవ (1978). ఈ సినిమాకు నిర్మాత కలైజ్ఞానం. ఆయన రచయిత కూడా. అయితే ఇప్పటివరకు ఆయన సొంత ఇంటికి నోచుకోక, అద్దె ఇంట్లోనే ఉంటున్నారని తెలిసి రజనీకాంత్ చలించిపోవడం, ఆపై తానే కొత్త ఇంటిని కానుకగా ఇస్తానని ప్రకటించడం తెలిసిందే.

ఆగస్టు 14న కలైజ్ఞానం సన్మాన సభ నిర్వహించగా, ఈ కార్యక్రమానికి రజనీకాంత్ తో పాటు మరో సీనియర్ నటుడు శివకుమార్ కూడా వచ్చారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ, కలైజ్ఞానం సొంత ఇంటిని నిర్మించుకోవడానికి తమిళనాడు ప్రభుత్వం సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే, వెంటనే రజనీకాంత్ స్పందించి, ఈ అవకాశం తమిళనాడు ప్రభుత్వానికి ఇవ్వను, నేను కలైజ్ఞానంకు ఇంటిని కొనిస్తాను అంటూ సభాముఖంగా హామీ ఇచ్చారు.

ఈ నేపథ్యంలో, తనకిష్టమైన దర్శకుడు భారతీరాజాకు కొత్త ఇంటిని వెదికే బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా కొన్నిరోజుల క్రితమే కోటి రూపాయలతో ఓ ఇంటిని కొనుగోలు చేసి కలైజ్ఞానంకు అప్పగించినట్టు కోలీవుడ్ మీడియా పేర్కొంది.
Rajinikanth
Kalaignanam

More Telugu News