Pawan Kalyan: నిడమర్రులో రైతుల నుంచి వినతిపత్రాలు స్వీకరించిన పవన్ కల్యాణ్

  • రాజధానిపై అనిశ్చితి
  • రైతుల ఆందోళన నేపథ్యంలో అమరావతిలో పవన్ పర్యటన
  • పలు గ్రామాల సందర్శన
రాజధానిగా అమరావతి కొనసాగింపు విషయంలో అనిశ్చితి ఏర్పడిన నేపథ్యంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆ ప్రాంత రైతుల వద్దకు తరలి వెళ్లారు. ఆయన ఇవాళ రాజధాని ప్రాంతంలోని పలు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. నిడమర్రులో రైతుల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు తన సమస్యలను పవన్ కు ఏకరవు పెట్టారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయం నుంచి పర్యటన ప్రారంభించిన పవన్ రైతుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు.

నిడమర్రు తర్వాత ఆయన కురగల్లు, ఐనవోలు ప్రాంతాల మీదుగా ఎన్ జీవోల కోసం నిర్మిస్తున్న క్వార్టర్లను, హైకోర్టు నిర్మాణాలను పరిశీలించనున్నారు. రాజధాని ప్రాంతంలోని సీడ్ యాక్సెస్ రోడ్లు, ఏపీ సచివాలయం, సీఆర్ డీఏ భవనాలు, జడ్జిలు, ప్రజాప్రతినిధుల క్వార్టర్లు తదితర ప్రాంతాల్లోనూ పవన్ పర్యటన సాగనుంది. చివరగా కొండవీడు ఎత్తిపోతల పథకం సందర్శనతో తన పర్యటన ముగించనున్నారు.
Pawan Kalyan
Jana Sena
Amaravathi

More Telugu News