Vijay Sai Reddy: టీటీడీలో ఇప్పుడు 5 కిలోల వెండి కిరీటాలు, దేవుడి ఉంగరాలు, నాణేలు మాయమైనట్టు బయటపడింది: విజయసాయిరెడ్డి

  • చంద్రబాబు హయాంలో టీటీడీలో అక్రమాలు అంటూ విజయసాయి ఆరోపణలు
  • స్వామివారి పింక్ డైమండ్ ఇప్పటికీ ఆచూకీ లేదంటూ ట్వీట్
  • ప్రజలు సమర్పించిన కానుకలను టీడీపీ నేతలు గద్దల్లా తన్నుకుపోయారంటూ విమర్శలు
టీటీడీలో శ్రీవారి ఆభరణాలు గల్లంతయ్యాయన్న ఆరోపణలు రావడం తెలిసిందే. దీనిపై వైసీపీ ముఖ్యనేత విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. చంద్రబాబునాయుడు హయాంలో టీటీడీలో అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని ఆరోపించారు. స్వామివారి గులాబీ రంగు వజ్రం ఇప్పటికీ ఎక్కడుందో తెలియడంలేదని, తాజాగా 5 కిలోల వెండి కిరీటాలు, దేవుడి ఉంగరాలు, నాణేలు మాయమైనట్టు వెల్లడైందని విజయసాయి తెలిపారు. ప్రజలు భక్తితో సమర్పించిన కానుకలను టీడీపీ నేతలు గద్దల్లా తన్నుకుపోయారని మండిపడ్డారు. ఈ మేరకు టీడీపీ, నారా లోకేశ్ లను కూడా ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.
Vijay Sai Reddy
Chandrababu
Telugudesam
Nara Lokesh
Jagan
YSRCP
TTD
Tirumala
Tirupati

More Telugu News