Sampath Kumar: చిరంజీవి బ్లడ్ బ్యాంకులో 140వ సారి రక్తదానం చేసిన ప్రముఖ సామాజికవేత్త సంపత్ కుమార్

  • రక్తదానాన్ని తన జీవితంలో భాగంగా చేసుకున్న సంపత్ కుమార్
  • పుట్టినరోజు సందర్భంగా 140వ సారి రక్తదానం
  • రక్తదానం విషయంలో ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన సంపత్ కుమార్
అన్ని దానాల్లోకెల్లా రక్తదానం మిన్న. తోటి వారి ప్రాణాలను కాపాడేందుకు మనం చేసే ఒక గొప్ప పని రక్తదానం. అలాంటి రక్తదానాన్ని తన జీవితంలో ఒక భాగంగా చేసుకున్న ప్రముఖ సామాజికవేత్త కె.సంపత్ కుమార్... ఇప్పటి వరకు ఎన్నోసార్లు రక్తదానం చేసి, ఎంతో మంది ప్రాణాలను నిలబెట్టడంలో తనదైన పాత్రను పోషించారు. తాజాగా తన 40వ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కు విచ్చేసి... 140వ సారి రక్తదానం చేశారు. తద్వారా రక్తదానం చేసే విషయంలో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయనపై చిరంజీవి యువత అధ్యక్షుడు, బ్లడ్ బ్యాంక్ జనరల్ మేనేజర్ ఆర్.స్వామినాయుడు ప్రశంసల జల్లు కురిపించారు. అలాగే మెగా బ్లడ్ బ్రదర్ కు జన్మదిన శుభాకాంక్షలు అంటూ మెగా అభిమానులతో పాటు మరెందరో ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సంపత్ కుమార్ కు ఆయురారోగ్యాలను ఇవ్వాలని కోరుకుంటున్నారు.
Sampath Kumar
Blood Donation
Chiranjeevi Blood Bank

More Telugu News