Nagarjuna: 60 ఏళ్లొచ్చినా తగ్గని ఫిట్ నెస్.. కండలు చూపించిన నాగార్జున

  • నిన్న 60వ పుట్టినరోజును జరుపుకున్న నాగ్
  • కుటుంబసభ్యులతో కలసి స్పెయిన్ లో వేడుకలు
  • నాగ్ ఫొటోను షేర్ చేసిన సమంత
టాలీవుడ్ హీరో నాగార్జున నిన్న తన 60వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్నారు. తన భార్య అమల, కుమారులు నాగచైతన్య, అఖిల్, కోడలు సమంతలతో కలసి స్పెయిన్ లో పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు.

నాగార్జున ఫిట్ నెస్ కు ఎంతో ప్రాధాన్యత ఇస్తారనే సంగతి తెలిసిందే. 60 ఏళ్ల వయసులో కూడా ఆయన కుర్రాడిలానే ఉన్నారు. కండలు చూపిస్తూ, యువతరానికి సవాల్ విసిరేలా ఉన్న ఓ ఫొటోను ఈ సందర్భంగా సోషల్ మీడియాలో సమంత పోస్ట్ చేసింది. 'మీరు వయసును జయించారు మామా' అంటూ కామెంట్ కూడా చేసింది.
Nagarjuna
Birthday
Samantha
Tollywood

More Telugu News