Chinthamaneni Prabhakar: గృహ నిర్బంధంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్

  • ఇసుక ఇబ్బందులపై రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఆందోళనలు
  • ఆందోళనను ఉద్ధృతం చేస్తామన్న చింతమనేని
  • ముందస్తు చర్యల్లో భాగంగా హౌస్ అరెస్ట్
ఇసుక ఇబ్బందులపై రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరోవైపు, ఆందోళనలను భగ్నం చేసే క్రమంలో టీడీపీ నేతలను ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేస్తున్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అంతకు ముందు చింతమనేని మాట్లాడుతూ, ఆందోళనను ఉద్ధృతం చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఆయనను గృహనిర్బంధం చేశారు. ఈ సందర్భంగా, పోలీసులకు వ్యతిరేకంగా చింతమనేని అనుచరులు నినాదాలు చేశారు. 'పోలీసులు గో బ్యాక్' అంటూ నినదించారు. మరోవైపు, కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు బచ్చుల అర్జునుడిని కూడా పోలీసులు గృహనిర్బంధం చేశారు.
Chinthamaneni Prabhakar
House Arrest
Telugudesam
Sand

More Telugu News