Bengaluru: తన నగ్న చిత్రాలు పంపి మహిళపై లైంగిక వేధింపులు.. కన్నడ మ్యూజిక్ కంపోజర్ అరెస్ట్

  • సోషల్ మీడియా ద్వారా మహిళకు పరిచయం
  • సినిమాలు, సీరియళ్లకు మ్యూజిక్ కంపోజ్ చేస్తానని నమ్మించిన నిందితుడు
  • టీవీ షోలు, మోడలింగ్‌లో అవకాశాలు కల్పిస్తానంటూ వేధింపులు
34 ఏళ్ల మహిళను లైంగికంగా వేధించిన మ్యూజిక్ కంపోజర్‌కు బెంగళూరులోని కుమారస్వామి లేఅవుట్ పోలీసులు అరదండాలు వేశారు. టీవీ షోలలో పాత్రలు, మోడలింగ్‌లో అవకాశాలు కల్పిస్తానంటూ మహిళను నమ్మించిన నిందితుడు మురళీధర్‌రావు ఆమెను లైంగికంగా వేధించాడు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని కటకటాల వెనక్కి పంపారు.

సోషల్ మీడియా ద్వారా ఈ ఏడాది జూన్‌లో నిందితుడు తనకు పరిచయం అయ్యాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తనను తాను మ్యూజిక్ కంపోజర్‌నని పరిచయం చేసుకున్న మురళీధరరావు కన్నడ సినిమాలు, సీరియళ్లకు మ్యూజిక్ కంపోజ్ చేస్తానని చెప్పాడు. టీవీ షోలలో పాత్రలు ఇప్పిస్తానని, ఫలితంగా లక్షలాది రూపాయలు ఆర్జించవచ్చని ఆమెను నమ్మబలికాడు. ఒకసారి తన స్టూడియోకు రావాలని మహిళను ఆహ్వానించాడు. ఆమె అందుకు అంగీకరించింది.

అయితే, ఆ తర్వాత అతడి ప్రవర్తనలో మార్పు వచ్చింది. తన నగ్న చిత్రాలను ఆమెకు పంపడం మొదలుపెట్టాడు. తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని డిమాండ్ చేశాడు. ఆమె వార్నింగ్ ఇచ్చినా అతడి ప్రవర్తనలో మార్పు లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు మురళీధర్‌రావును అరెస్ట్ చేశారు.
Bengaluru
sexual harassment
music composor

More Telugu News