Andhra Pradesh: ఏపీలో పార్టీ బలోపేతంపై దృష్టి.. ప్రతి జిల్లాలో పర్యటించనున్న చంద్రబాబు

  • సెప్టెంబర్ 5, 6 తేదీల్లో తూ.గో. జిల్లా నుంచి పర్యటన  
  • ప్రతి వారంలో రెండ్రోజులు పర్యటన
  • జిల్లా కేంద్రంలోనే రెండ్రోజులు మకాం వేయనున్న బాబు
ఏపీలో టీడీపీ బలోపేతంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు దృష్టి సారించారు. ప్రతి జిల్లాలో క్షేత్ర స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ప్రతి జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. ప్రతి వారంలో రెండ్రోజుల పాటు పర్యటిస్తారని సమాచారం. తూర్పుగోదావరి జిల్లా నుంచి సెప్టెంబర్ 5, 6 తేదీల్లో ఈ పర్యటన ప్రారంభిస్తారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. జిల్లా కేంద్రంలోనే రెండ్రోజులు చంద్రబాబు మకాం వేస్తారని, టీడీపీ జిల్లా సర్వసభ్య సమావేశంలో పాల్గొంటారని, నియోజకవర్గాల వారీగా సమీక్షలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తారని సమాచారం.
Andhra Pradesh
Telugudesam
Chandrababu
East godavari

More Telugu News