Chittoor District: కాణిపాకం వరసిద్ధి వినాయకుడికి బంగారు రథం!

  • ఏపీ ప్రభుత్వం తరపున బంగారు రథం చేయిస్తున్నాం
  • ఇందుకోసం రూ.6 కోట్లు వెచ్చిస్తాం
  • టీటీడీ ఆధ్వర్యంలో రథం తయారు: మంత్రి వెల్లంపల్లి
చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామికి ఏపీ ప్రభుత్వం బంగారు రథం తయారు చేయించి ఇవ్వనుంది. ఈ మేరకు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఓ ప్రకటన చేశారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ తరపున రూ.6 కోట్ల వ్యయంతో స్వామి వారికి బంగారు రథం తయారు చేసేందుకు అనుమతించినట్టు పేర్కొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అత్యంత నాణ్యతతో ఈ బంగారు రథాన్ని తయారు చేస్తున్నట్లు తెలిపారు.

సెప్టెంబర్ 2 నుంచి 22 వరకు కన్నుల పండువగా వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులు, యాత్రికులకు వసతి, తాగు నీరు సమకూర్చడంతో పాటు దేవాలయాల పరిశుభ్రతను పాటించాలని కాణిపాకం దేవస్థానం ఈవో, అధికారులను మంత్రి ఆదేశించారు. కాణిఫాకం వరసిద్ధి వినాయకుడికి తయారు చేసే బంగారు రథం నమూనా చిత్రం క్రింది విధంగా ఉండనున్నట్టు సమాచారం.
Chittoor District
Kanipakam
Varasiddhi
Vinayak

More Telugu News