నాకు పొగరెక్కువని అనుకోవడానికి అదో కారణం కావచ్చు: సీనియర్ హీరోయిన్ జమున
- నాకు అహంకారం లేదు
- నాపై ఆ పాత్రల ప్రభావం ఉండొచ్చు
- నన్ను అందాల తారగా చూశారు
నిజంగానే నేను గర్విష్టినైతే సుదీర్ఘ కాలం పాటు ఇండస్ట్రీలో ఉండగలిగే దానినా? 40 ఏళ్ల పాటు చిత్రపరిశ్రమలో వున్నాను. 25 సంవత్సరాల పాటు ఏకధాటిగా హీరోయిన్ గా చేశాను. హీరోయిన్ గా చేస్తోన్న సమయంలో నా శరీరాకృతిలో మార్పులు రావడంగానీ, అవకాశాలు తగ్గడంగాని జరగలేదు. ప్రేక్షకులు నన్ను ఓ అందాల తారగా మాత్రమే చూడటానికి ఇష్టపడ్డారు. అందువల్లనే నేను అమ్మ .. అత్త పాత్రలు ఎక్కువగా చేయలేదు" అని చెప్పుకొచ్చారు.