Telugudesam: పాత కేసులు తవ్వడం వైసీపీ వేధింపులకు పరాకాష్ఠ: చంద్రబాబునాయుడు

  • గతంలో గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ దోపిడీపై పోరాడాం
  • దానిపై ఇప్పుడు కేసులు పెడతారా?
  • నోరు నొక్కి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు
టీడీపీ నేతలపై ఉన్న పాత కేసులు తవ్వడం వైసీపీ వేధింపులకు పరాకాష్ఠ అని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో తమ నేతలతో ఆయన భేటీ అయ్యారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించడాన్ని చంద్రబాబు ఖండించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఇవాళ ఎమ్మెల్యే కరణం బలరామ్ పై, నిన్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై, మొన్న కూన రవికుమార్ పై వైసీపీ అక్రమ కేసులు బనాయించిందని నిప్పులు చెరిగారు.

గతంలో గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ దోపిడీపై పోరాడితే, ఇప్పుడు కేసులు పెడతారా? అని ప్రశ్నించారు. వందలాది మంది కార్యకర్తలపై కేసులు బనాయిస్తున్నారని, నోరు నొక్కి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు.
Telugudesam
Chandrababu
YSRCP
Jagan
Karanam

More Telugu News