Andhra Pradesh: జగన్ గారూ, మీ వైసీపీ రౌడీలకు ఇంకా తెలిసిరావడంలేదు!: నారా లోకేశ్

షార్ట్స్‌లో చూడండి
ఏపీ సీఎం జగన్, వైసీపీకి చెందిన వారిపై టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ మండిపడ్డారు. రాష్ట్రంలో వైసీపీ చేస్తున్న అరాచకాలకు అడ్డూఆపూ లేకుండా పోయాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వరుస ట్వీట్లు చేశారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యారని, రాష్ట్ర ప్రజలందరి బాగోగులకి ఆయనే జవాబుదారీ అని వైసీపీ రౌడీలకు ఇంకా తెలిసిరావడం లేదని విమర్శించారు. అందుకే, వారి దౌర్జన్యాలను రాష్ట్రమంతా కొనసాగిస్తున్నారని, వైసీపీ వాళ్ళు ప్రజల పాలిట చావు కంటే ప్రమాదకరంగా, యమభటుల్లా మారుతున్నారని విమర్శించారు.

జగన్ అధికారంలోకి వచ్చాక వానల్లేక పొలాలు ఎండిపోతున్నాయని, చేనుకు ఆధారంగా ఉన్న బోరును కూడా వైసీపీ వాళ్ళు ధ్వంసం చేస్తే ఆ రైతు ఎలా బతకాలి? ప్రాణానికే ప్రమాదకరమైన ట్రాన్స్ ఫార్మర్ ఎక్కాడంటే ఈ రైతును వైసీపీ వాళ్ళు ఎంత హింసిస్తున్నారో చూడండి అంటూ రెండు ఫొటోలను పోస్ట్ చేశారు. ఓ ముఖ్యమంత్రిగా జగన్ ఈ ఘటనపై వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
Go Back to Shorts
Andhra Pradesh
cm
Jagan
Telugudesam
Nara Lokesh

More Telugu News