భారత్ ను నాశనం చేయాలనుకుంటున్న పాకిస్థాన్ తో ఏం మాట్లాడతాం?: రాజ్ నాథ్ సింగ్
- కశ్మీర్ పై పడి ఏడవడాన్ని పాక్ ఆపేయాలి
- ఉగ్రవాదంపై చర్యలు తీసుకోవాలి
- పీవోకేలో మానవహక్కుల ఉల్లంఘనలపై పాక్ మాట్లాడాలి
కశ్మీర్ భారత్ లో ఎప్పటికీ అంతర్భాగమేనని రాజ్ నాథ్ చెప్పారు. పాకిస్థాన్ ను తాను ఒకటే అడుగుతున్నానని... కశ్మీర్ వారిది ఎప్పుడయిందో చెప్పాలని ఎద్దేవా చేశారు. కశ్మీర్ పై పడి ఏడవటాన్ని ఆ దేశం ఆపేయాలని అన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ లో చోటుచేసుకుంటున్న మానవహక్కుల ఉల్లంఘనలపై పాకిస్థాన్ మాట్లాడాలని సూచించారు. జమ్ముకశ్మీర్ విషయంలో ప్రపంచంలోని ఏ దేశం కూడా పాకిస్థాన్ కు మద్దతును ప్రకటించలేదని అన్నారు.