Andhra Pradesh: టీడీపీ బలోపేతానికి అనుబంధ సంఘాలు కీలకపాత్ర పోషించాలి: నారా లోకేశ్

  • ఏపీ టీడీపీ ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్ సంఘాల అధ్యక్షులతో లోకేశ్ భేటీ
  • రెండు వారాల్లోగా కార్యవర్గాల ఎన్నిక పూర్తి చేయాలి
  • యువత, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి

టీడీపీ ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్ సంఘాల ఏపీ అధ్యక్షులతో టీడీపీ అగ్ర నేత నారా లోకేశ్ భేటీ అయ్యారు. పార్టీ బలోపేతానికి అనుబంధ సంఘాలు కీలకపాత్ర పోషించాలని, అనుబంధ సంఘాలను గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయాలని ఆదేశించారు. రెండు వారాల్లోగా ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్ రాష్ట్ర సంఘాల కార్యవర్గాల ఎన్నిక పూర్తి చేయాలని, కార్యవర్గాల ఎన్నికలో యువత, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్లకు జరుగుతున్న అన్యాయంపై ఉద్యమించాలని, అనుబంధ సంఘాలకు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
Andhra Pradesh
Telugudesam
Nara Lokesh
YSRCP
Govt

More Telugu News