Prabhas: 'సాహో' టికెట్ ధర పెంచేందుకు ఒప్పుకోని సీఎం జగన్!

  • భారీ బడ్జెట్ తో తెరకెక్కిన 'సాహో'
  • టికెట్ల ధరను పెంచుకునేందుకు అనుమతి కోరిన చిత్ర యూనిట్
  • అనుమతించని ప్రభుత్వం
భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ప్రభాస్ 'సాహో' చిత్రం రేపు విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో టికెట్ల ధరలను పెంచుకునేందుకు అనుమతించాల్సిందిగా ఏపీ ప్రభుత్వాన్ని చిత్ర యూనిట్ కోరింది. అయితే, టికెట్ల ధరను పెంచేందుకు అనుమతించడం లేదని ప్రభుత్వం తెలిపింది.

టికెట్ల ధర పెంపు అంశాన్ని ముఖ్యమంత్రి జగన్ తో అధికారులు ప్రస్తావించారు. అయితే, ధర పెంపుకు జగన్ సుముఖత చూపలేదని సమాచారం. ఒక్కో సినిమాకు ఒక్కో ధర ఉండటం సరికాదని ఈ సందర్భంగా జగన్ వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. దీంతో, అన్ని సినిమాలకు ప్రభుత్వ విధానం ఒకేలా ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.
Prabhas
Jagan
Saaho
Tollywood

More Telugu News