Kodela: ఇంకా ఏమైనా ఉంటే తీసుకెళ్లండి.. నన్ను క్షోభ పెట్టొద్దు: కోడెల

  • నా కార్యాలయంలో ఉన్న సామగ్రిని తీసుకెళ్లాలని అధికారులకు లేఖలు రాశా
  • అసెంబ్లీ స్పీకర్ కు కూడా ఓ లేఖ రాశా
  • అయినా ఎవరూ స్పందించలేదు
గుంటూరులోని తన క్యాంపు కార్యాలయంలో ఉన్న సామగ్రిని తీసుకెళ్లాలని అసెంబ్లీ అధికారులకు లేఖలు రాసినా వారు స్పందించలేదని మాజీ స్పీకర్, టీడీపీ నేత కోడెల శివప్రసాదరావు తెలిపారు. జూన్ 7న ఒక లేఖ, ఆగస్ట్ 20న రెండో లేఖ రాశానని చెప్పారు. నేరుగా స్పీకర్ కు కూడా ఓ లేఖ రాశానని... అయినా ఎవరూ స్పందించలేదని అన్నారు.

ఇటీవలే తన కార్యాలయానికి వచ్చిన అధికారులు సామగ్రిని తీసుకెళ్లారని, ఇంకా ఏమైనా ఉంటే తీసుకెళ్లాలని చెప్పారు. అనవసరంగా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ క్షోభ పెట్టవద్దని కోరారు. 37 ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్నానని... విలువలకు కట్టుబడి జీవిస్తున్నానని చెప్పారు.
Kodela
Telugudesam
Assembly
Furniture

More Telugu News