Kurnool District: ఎత్తిపోతల పథకానికి నీటి విడుదలలో అపశ్రుతి.. పరుగులు తీసిన వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు!

  • సిద్ధాపురం ఎత్తిపోతల పథకానికి నీటి విడుదల
  • లిఫ్ట్ ఇరిగేషన్ పైపుల్లో ఎయిర్ లాక్
  • ఒక్కసారిగా ఎగజిమ్మిన నీరు
కర్నూలు జిల్లా ఆత్మకూరులో సిద్ధాపురం ఎత్తిపోతల పథకానికి నీటిని విడుదల చేసేందుకు వెళ్లిన వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు ఓ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు నంద్యాల ఎంపీ పోచాల బ్రహ్మానందరెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ వెళ్లారు. లిఫ్ట్ ఇరిగేషన్ పైపుల్లో ఎయిర్ లాక్ కావడంతో ఒక్కసారిగా నీరు పైకి ఎగజిమ్మింది. దీంతో, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, రైతులు, మీడియా ప్రతినిధులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఏం జరుగుతున్నదో కొంచెం సేపు అర్థం కాలేదు. వెంటనే, అక్కడి నుంచి పరుగులు తీశారు.
Kurnool District
Aatmakur
YSRCP
mp
mla`s

More Telugu News